News August 28, 2024

‘దేవర’ మూడో సాంగ్ ఎప్పుడొచ్చినా బీభత్సమే: రామజోగయ్య

image

దేవర మూవీ నుంచి విడుదలైన ఫియర్, చుట్టమల్లే సాంగ్స్ అదరగొడుతున్నాయి. తాజాగా మూడో పాటపై గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ‘మూడో పాట.. పాటకు మించిన ఆట.. కన్నుల పండుగ. ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు. ఎప్పుడని అడక్కండి.. ఎప్పుడొచ్చినా బీభత్సమే. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే’ అని Xలో పోస్టు చేశారు. దీంతో ఆ మాటలే గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 16, 2026

NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>NTPC<<>>లో 6 అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CLAT-2026 పీజీలో సాధించిన స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/

News January 16, 2026

కనుమ రోజు మినుము ఎందుకు తినాలి?

image

కనుమ పశువులకు, పితృదేవతలకు అంకితం చేసిన పండుగ. ఈరోజు చనిపోయిన పెద్దల కోసం పెట్టే ప్రసాదాల్లో గారెలు ప్రధానమైనవి. వీటిలో పోషకాల విలువలు ఎక్కువ. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, బలాన్ని అందించడంలో మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ‘కనుమ రోజు మినుము తినాలి’ అనే సామెత పుట్టింది. ఆ రోజు అల్లుళ్లు, బంధువులతో కలిసి మినుములతో చేసిన వంటకాలు తింటూ, విశ్రాంతిగా గడపడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం.

News January 16, 2026

పౌడర్ రాయడం వల్ల ఈ నష్టాలు

image

బిడ్డకు చెమటలు పడుతున్నప్పుడు పదే పదే పౌడర్ రాస్తే అది తేమను గ్రహించి చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. పౌడర్ వేయడం వల్ల పిల్లల్లో అలెర్జీలు, ఉబ్బసం, దగ్గు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శిశువు చర్మాన్ని పొడిగా, సౌకర్యవంతంగా ఉంచాలనుకుంటే చర్మంపై కొబ్బరి నూనె వాడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల కోసం పౌడర్‌ను కొనేముందు వైద్యులు సూచించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచిది.