News May 28, 2024
టాటూలతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు!
టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21% అధికంగా ఉందని స్వీడన్ సైంటిస్టులు వెల్లడించారు. 20-60 ఏళ్ల వయసున్న 11,905 మందిపై వారు అధ్యయనం చేశారు. ‘చర్మంపై టాటూ ఇంక్ పడగానే రోగ నిరోధక వ్యవస్థ ప్రభావానికి గురవుతుంది. చర్మం ద్వారా ఇంక్ lymph nodesలో పేరుకుపోతుంది. దీంతో లింఫోమా క్యాన్సర్ రావొచ్చు. టాటూ సైజును బట్టి తీవ్రత పెరగొచ్చు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలి’ అని వారు తెలిపారు.
Similar News
News January 12, 2025
కరుణ్ నాయర్ మళ్లీ సెంచరీ
విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ <<15055540>>కరుణ్ నాయర్<<>> ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ (122*) మరో సెంచరీ బాదారు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. 82 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. నాయర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో విదర్భ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
News January 12, 2025
హింసా రాజకీయాలకు సీఎం రేవంత్ ప్రోత్సాహం: హరీశ్ రావు
TG: INC ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసిందని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. ప్రజలు ఆరు గ్యారంటీలను ప్రశ్నించకుండా ఉండేందుకు CM రేవంత్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రైతు కూలీలు, అన్ని రకాల వడ్లకు బోనస్, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని ఫైరయ్యారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు కూడా రైతు కూలీలేనని, వారికి కూడా రూ.12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News January 12, 2025
మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ జరుగుతుందని చెప్పారు. బీసీసీఐ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌కు కొత్త కమిషనర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. కాగా తొలుత మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుందని శుక్లా ప్రకటించారు. అనంతరం 21నే ప్రారంభిస్తామని చెప్పారు.