News April 11, 2024
ముగ్గురం మళ్లీ జతకట్టాం.. జగన్ నిలబడగలడా?: CBN

AP: చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు CM జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘CM ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు. 2014లో పవన్ పోటీ చేయకుండా మద్దతిచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు వన్‌సైడ్ తీర్పిచ్చారు. మరోసారి మోదీ, నేను, పవన్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్‌కు ఉందా?మీరు నిలబడనిస్తారా? ఎన్నికలు లాంఛనమే. కూటమి గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News January 18, 2026
‘గ్రీన్‌లాండ్ డీల్’ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే తన లక్ష్యాన్ని వ్యతిరేకించిన దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. గ్రీన్‌లాండ్ డీల్ పూర్తి కాకపోతే జూన్ 1 నుంచి టారిఫ్స్‌ను 25 శాతానికి పెంచుతానని హెచ్చరించారు.
News January 18, 2026
మెరిసిన మంధాన.. RCB ఘన విజయం

WPL: ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన(96), జార్జియా హాఫ్ సెంచరీ(54*)తో రాణించడంతో 167రన్స్ లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. DC బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. మారిజాన్, నందినీ శర్మలకు చెరో వికెట్ దక్కింది. ఢిల్లీ తరఫున షెఫాలీ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.
News January 18, 2026
రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.


