News April 11, 2024

ముగ్గురం మళ్లీ జతకట్టాం.. జగన్ నిలబడగలడా?: CBN

image

AP: చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు CM జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘CM ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు. 2014లో పవన్ పోటీ చేయకుండా మద్దతిచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు వన్‌సైడ్ తీర్పిచ్చారు. మరోసారి మోదీ, నేను, పవన్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్‌కు ఉందా?మీరు నిలబడనిస్తారా? ఎన్నికలు లాంఛనమే. కూటమి గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 19, 2025

టెన్త్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

image

TG: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్‌తో పాటు సీరియల్ నంబర్‌ను ముద్రిస్తున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇవ్వనున్నారు. అదనపు షీట్లు ఇవ్వరు. ఉ.9.30 గం.కు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

News March 19, 2025

అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంటుందంటే?

image

భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.

News March 19, 2025

రాత్రికి రాత్రే YSR పేరు తొలగించారు: వైసీపీ

image

AP: విశాఖపట్నంలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయికి చేరిందని వైసీపీ ఆరోపించింది. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న YSR పేరును టీడీపీ నేతలు తొలగించారు. రాత్రికి రాత్రే డా.వైఎస్సార్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు’ అని Xలో ఫొటోలు పోస్ట్ చేసింది.

error: Content is protected !!