News March 19, 2024
అనుష్క సినిమాకు టైటిల్ ఫిక్స్
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి.. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఆమె తెలుగులో ఓ మూవీ చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఘాటి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
Similar News
News September 17, 2024
గణేశ్ నిమజ్జనం.. మద్యం షాప్‌లు బంద్
TG: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో HYD వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాప్‌లు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ CV ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది.
News September 17, 2024
ఇవాళ సెలవు.. నవంబర్ 9న వర్కింగ్ డే
TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు హాలిడే వర్తిస్తుంది. అయితే వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే పలు సెలవులు వచ్చినందున నవంబర్ 9న రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు విద్యాసంస్థలు యథాతథంగా నడవనున్నాయి.
News September 17, 2024
రాజీవ్ విగ్రహంపై వివాదం.. నేడు రాష్ట్రంలో BRS ఆందోళనలు
TG: సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై BRS మండిపడుతోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుచేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ అవమానించారని కేటీఆర్ విమర్శిస్తున్నారు.