News May 13, 2024
రైలు 9 గంటలు ఆలస్యం.. ఆందోళనలో ఓటర్లు
నాందేడ్-విశాఖ రైలు 9 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న AP ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా 5 గంటలు లేటు అని చెప్పగా సాయంత్రానికైనా వెళ్తామని భావించామన్నారు. కానీ ఇప్పుడు ఓటు వేయడం అనుమానమే అని తెలిపారు. దీనిపై EC, రైల్వే శాఖలు స్పందించి తాము ఓటేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ రైలులో ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 28, 2024
మెగా డీఎస్సీ ఆలస్యం.. నిరుద్యోగుల అసంతృప్తి
AP: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడటంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు 3 నెలల గడువు ఉంది. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు కనీసం 3-4 నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త టీచర్లకు శిక్షణ, పోస్టింగ్ మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
News December 28, 2024
న్యూ ఇయర్.. మందుబాబులకు శుభవార్త
TG: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని సూచించింది.
News December 28, 2024
నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
AP: విజయవాడ కేబీఎన్ కాలేజీ వేదికగా నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సభలను ప్రారంభించనుండగా, ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు జరగనున్నాయి. దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా భాషాభిమానులు, కవులు పాల్గొంటారు.