News July 20, 2024

వ్యవసాయ శాఖలో అధికారుల బదిలీలు నిలిపివేత!

image

TG: పంటల రుణమాఫీ పథకం అమలవుతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖలో అధికారుల బదిలీలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏఈఓ, ఎంఏఓ, ఏడీ, డీఏఓల బదిలీని ఆపేస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. అప్పటివరకూ ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లోనే పనిచేయాలని అధికారులను ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి బదిలీలు జరగాల్సి ఉంది.

Similar News

News October 11, 2024

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: లోకేశ్

image

AP: పంటలు పండని అనంతపురంలో కార్లు పరిగెత్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళగిరిలో కియా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడిన్ ఆంధ్రా అంటున్నారు. CBN విజన్ ఉన్న నాయకుడు. TCSను ఒప్పించి పెట్టుబడులు తేవడమే కాదు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చిన్న పరిశ్రమలనూ ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.

News October 11, 2024

ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం

image

ముల్తాన్‌ టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాభవంపాలైంది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 556 పరుగులు చేశాక కూడా ప్రత్యర్థి చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇలా ఓడిన తొలిజట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను 823-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 220కే ఆలౌటైంది. లీచ్ 4 వికెట్లు పడగొట్టారు.

News October 11, 2024

యువకుడి కడుపులో ప్రాణాలతో బొద్దింక.. వైద్యులు ఏం చేశారంటే?

image

ఢిల్లీ డాక్టర్లు ఓ యువకుడి కడుపులో బతికి ఉన్న బొద్దింకను ఎండోస్కోపి ద్వారా తొలగించారు. గత కొంత కాలంగా యువకుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా పరీక్షించిన ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు చిన్న పేగుల్లో బొద్దింక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతనికి ఎండోస్కోపి చేసి దానిని తొలగించారు. అన్నం తింటుండగా లేదా నిద్రిస్తున్న సమయంలో నోటి ద్వారా బొద్దింక లోపలికి వెళ్లి ఉంటుందని చెప్పారు.