News August 29, 2024
విలేకరులపై కేసు పెట్టిన కేంద్ర మంత్రి

కేంద్ర సహాయమంత్రి సురేశ్ గోపీ విలేకరులపై త్రిసూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయించారు. ‘తనను, తన భద్రత సిబ్బందిలో ఒకరైన విష్ణురాజును కారులోకి వెళ్లకుండా అడ్డుకొని అధికారిక విధులకు ఆటంకం కలిగించారని సురేశ్ గోపీ ఫిర్యాదు చేశారు. BNSలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని పోలీసులు తెలిపారు. నటుడు, లెఫ్ట్ ఎమ్మెల్యే ముకేశ్‌పై ఆరోపణల గురించి అడగ్గా గోపీ విలేకరులను నెట్టేసినట్టు తెలిసింది.
Similar News
News February 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 16, 2025
నేటి ముఖ్యాంశాలు

* 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం: సీఎం రేవంత్
* ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: భట్టి
* BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
* మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తాం: సీఎం చంద్రబాబు
* టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: మంత్రి లోకేశ్
* జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్
News February 16, 2025
తాజ్ మహల్‌ను సందర్శించిన రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తాజ్ మహల్ సందర్శించారు. తన భార్య పిల్లలతో పాటు అత్తమ్మ సుధామూర్తితో కలిసి 90 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఈ పర్యటన తమ పిల్లలు ఎప్పటికీ మర్చిపోరని అతిథ్యానికి ధన్యవాదాలు అని విజిటర్ బుక్‌లో రాశారు. అయితే రిషి సునాక్ రేపు ఉదయం మరోసారి తాజ్‌మహల్ చూడటంతో పాటు ఆగ్రాలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని ప్రస్తుతం భారత పర్యటనలోఉన్నారు.