News March 19, 2024
ఈ షూ విలువ రూ.164 కోట్లు
సాధారణంగా రూ.164 కోట్లు అంటే ఏదో బిలియనీర్ నెట్ వర్త్ అనే అనుకుంటారు. అయితే అంత ఖరీదైన షూ ఉన్నాయనే విషయం మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఖరీదైన షూ తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న ఇటాలియన్ షూ డిజైనర్ ఆంటోనియా వైట్రీ వీటిని రూపొందించారు. ఈ ‘మూన్ స్టార్ షూ’ ప్రపంచంలోనే ఖరీదైన షూగా ఫోర్బ్స్ గుర్తించింది. వీటి హీల్స్ గోల్డ్, డైమండ్స్(30 క్యారట్స్)తో చేశారు.
Similar News
News September 18, 2024
క్యాబినెట్ భేటీ ప్రారంభం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీతో పాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
News September 18, 2024
నటి CID శకుంతల కన్నుమూత
దక్షిణాది నటి CID శకుంతల(84) కన్నుమూశారు. బెంగళూరులో ఛాతి నొప్పితో నిన్న తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 సినిమాల్లో, పలు సీరియళ్లలో నటించారు. MGR, శివాజీ వంటి లెజెండరీ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి పలు సినిమాల్లో ఆమె కనిపించారు.
News September 18, 2024
ఓటీటీలోకి ’35 చిన్న కథ కాదు’.. ఎప్పుడంటే?
ఈనెల 6న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ’35 చిన్న కథ కాదు’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.