News March 9, 2025

అడుగంటిన నీరు.. ఎండుతున్న పైరు

image

వేసవి ఇంకా ముదరకముందే TGలో పంటలు ఎండుతున్నాయి. గతేడాది కృష్ణా, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉండటం, ప్రాజెక్టులు సైతం కళకళలాడటం, భూగర్భజలాలు పెరగడంతో అన్నదాతలు వరిసాగు గణనీయంగా పెంచారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితి దిగజారింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఖాళీ అయ్యాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు అడుగంటాయి. దీంతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

Similar News

News March 16, 2025

రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

image

TG: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. OBMMS ఆన్‌లైన్ పోర్టల్‌‌లో ఏప్రిల్‌ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ₹3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60%-80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి ₹6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. వివరాలకు http//tgobmms.cgg.gov.in/ సంప్రదించండి.

News March 16, 2025

ట్విటర్లో గ్రోక్ హల్‌చల్.. మీమ్స్ వైరల్

image

ట్విటర్ తీసుకొచ్చిన గ్రోక్ AI గురించి నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. నిజమైన మనిషి తెలుగును ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే ఎలా ఉంటుందో అదే తరహాలో భాషలో ఎటువంటి తప్పులూ లేకుండా గ్రోక్ జవాబులిస్తోంది. ఆఖరికి బూతులు కూడా నేర్చుకుని, తిట్టిన వారిని తిరిగి తిడుతుండటంతో ట్విటర్ జనాలు జోకులు పేలుస్తున్నారు. ఫ్యాన్ వార్స్‌లోనూ గ్రోక్‌ను ఇన్వాల్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా భాషల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.

News March 16, 2025

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం బ్రేక్

image

AP: కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని (35వేల క్యూసెక్కులు) తరలించేలా ఈ ఎత్తిపోతల పథకం చేపట్టారు. అనుమతులు నిరాకరించడంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!