News November 7, 2024
మోదీని ప్రపంచమంతా ప్రేమిస్తోంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మరోసారి ఇద్దరం కలిసి పనిచేద్దామని, ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచశాంతికి కృషి చేద్దామన్నారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని.. భారత్ అద్భుత దేశమని ట్రంప్ కొనియాడారు. భారత్, మోదీని నిజమైన స్నేహితులుగా భావిస్తానని ఆయన తెలిపారు.
Similar News
News December 2, 2024
రూ.67వేల కోట్ల అప్పు ఏం చేశారు?: బొత్స
AP: కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో ₹67వేల కోట్ల అప్పు చేసిందని, రేపు మరో రూ.4వేల కోట్ల అప్పు తీసుకోబోతోందని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ అప్పు అంతా దేనికోసం ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ తప్ప మిగతా ఏ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. YCP ప్రభుత్వముంటే ఈ 6నెలల్లో ₹18,000కోట్లు పేదల ఖాతాల్లో వేసే వాళ్లమని చెప్పారు.
News December 2, 2024
భారీ జీతంతో 334 ఉద్యోగాలు
NLC ఇండియా లిమిటెడ్‌లో 334 పోస్టులకు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జనరల్ మేనేజర్, అడిషనల్ చీఫ్ ఇంజినీర్ పోస్టులున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు అర్హులు. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.50,000-2,80,000 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
సైట్: https://www.nlcindia.in/
News December 2, 2024
గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు: హెడ్ ప్రశంసలు
AUS స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ IND స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. BGT తొలి టెస్టులో 89 పరుగులు చేసిన హెడ్‌ను బుమ్రా ఔట్ చేయగా అప్పటి నుంచి దీనిపై ఆయన స్పందించలేదు. తాజాగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హెడ్ స్పందిస్తూ.. ‘నేను ఆడిన గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నానని నా మనవళ్లతో చెప్పడం కూడా బాగుంటుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.