News September 29, 2024
రాత్రి ఆటో ఎక్కిన మహిళా ఏసీపీ.. తర్వాతేమైందంటే..
సుకన్య శర్మ ఆగ్రాలో ఏసీపీగా పనిచేస్తున్నారు. మహిళల భద్రత ఎలా ఉందో చూసేందుకు స్వయంగా రాత్రివేళ రంగంలోకి దిగారు. ముందుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కి కాల్ చేశారు. వారు సక్రమంగా రెస్పాండ్ అవుతున్నట్లు గుర్తించారు. అనంతరం సామాన్యురాలిలా ఓ ఆటో ఎక్కారు. సదరు డ్రైవర్ ఆమె చెప్పిన చోట క్షేమంగా దించాడు. మహిళల భద్రతా పరిశీలన కోసం ఆమె ఇలా స్వయంగా రంగంలోకి దిగడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Similar News
News October 15, 2024
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు
AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.
News October 15, 2024
కెనడాతో ఇక కటిఫ్.. ఎన్నికల వరకు ఇంతేనా!
భారత్-కెనడా మధ్య వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ట్రూడో ప్రభుత్వ ఖలిస్తానీ వేర్పాటువాద అనుకూల విధానాలపై ఆగ్రహంగా ఉన్న భారత్ అక్కడి దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. అలాగే ఇక్కడి కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. కెనడాలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వరకు పరిస్థితులు సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. కెనడా వైఖరి మారితేనే దౌత్య బంధాలపై స్పష్టతరానుంది.
News October 15, 2024
అక్టోబర్ 15: చరిత్రలో ఈ రోజు
1931: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జననం
1933: డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి జననం
1939: నటుడు జీ రామకృష్ణ జననం
1953: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జననం
1987: హీరో సాయి ధరమ్ తేజ్ జననం
1994: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ జననం
2022: సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం