News March 30, 2024

25ఏళ్లలో భారీగా పడిపోనున్న ప్రపంచ జనాభా!

image

ప్రపంచ దేశాల జనాభాపై లాన్సెట్ జర్నల్ పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. 25ఏళ్లలో 155 దేశాలు/టెర్రిటరీల్లో జనాభా గణనీయంగా పడిపోనుందని పరిశోధకులు తెలిపారు. 2100కు ఆ దేశాల సంఖ్య 198కు చేరడమే కాక జననాల రేటు మరణాల రేటు కంటే తక్కువగా ఉండనుందట. ఈ నేపథ్యంలో రానున్న మార్పులు ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 24, 2025

నకిలీ వెబ్‌సైట్ల కలకలం.. శ్రీశైలం భక్తులకు అలర్ట్

image

AP: శ్రీశైలంలో వసతులు కల్పిస్తామంటూ AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ₹30Kతో రూమ్స్ బుక్ చేశారు. అక్కడికి వచ్చి రశీదు చూపించగా సిబ్బంది నకిలీదని చెప్పడంతో షాకయ్యారు. ఇలాగే పలువురు మోసాలకు గురయ్యారు. దీంతో ఆయా వెబ్‌సైట్లపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News November 24, 2025

ఎన్నికలపై విచారణ వాయిదా

image

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.

News November 24, 2025

హనుమాన్ చాలీసా భావం – 19

image

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥
సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమ. అలాంటిది శ్రీరాముని ఉంగరంతో సముద్రాన్ని దాటడం ఆశ్చర్యాన్ని కలిగించదు. హనుమంతుని అద్భుత శక్తులు తెలిసిన తర్వాత సముద్ర లంఘనం ఆయనకు ఎంతో సులువు అని కవి ఉద్దేశం. దైవకార్య సాధనలో ఎంత కష్టమైన పనైనా సునాయసంగా పూర్తవుతుందనే సందేశం ఈ దోహా ఇస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>