News March 30, 2024
25ఏళ్లలో భారీగా పడిపోనున్న ప్రపంచ జనాభా!
ప్రపంచ దేశాల జనాభాపై లాన్సెట్ జర్నల్ పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. 25ఏళ్లలో 155 దేశాలు/టెర్రిటరీల్లో జనాభా గణనీయంగా పడిపోనుందని పరిశోధకులు తెలిపారు. 2100కు ఆ దేశాల సంఖ్య 198కు చేరడమే కాక జననాల రేటు మరణాల రేటు కంటే తక్కువగా ఉండనుందట. ఈ నేపథ్యంలో రానున్న మార్పులు ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 16, 2025
KL రాహుల్, శాంసన్‌కు షాక్?
ఛాంపియన్స్ ట్రోఫీలో WKలుగా KL రాహుల్, శాంసన్‌కు ఛాన్స్ దక్కకపోవచ్చని వార్తలొస్తున్నాయి. రాహుల్‌ను స్పెషలిస్ట్ WKగా ఆడించేందుకు సెలక్టర్లు ఆసక్తిగా లేరని, VHTలో ఆడకపోవడంతో శాంసన్ ఈ ఛాన్స్ కోల్పోయినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. WK స్థానానికి పంత్, జురెల్ ఎంపికవ్వొచ్చని అంచనా వేసింది. రానున్న రోజుల్లో శాంసన్ T20ల్లో, పంత్&జురెల్ టెస్ట్, ODIల్లో కొనసాగుతారని తెలిపింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
News January 16, 2025
హిండెన్‌బర్గ్‌ను ఇప్పుడే ఎందుకు మూసేసినట్టు!
US షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ షట్‌డౌన్ టైమింగ్‌పై చాలామందికి డౌట్ వస్తోంది. JAN 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. కొన్ని రోజుల క్రితమే హౌస్ జుడీషియరీ కమిటీలోని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడొకరు అదానీ, అతడి కంపెనీలపై కమ్యూనికేషన్, దర్యాప్తు పత్రాలు, ఆధారాలన్నీ పరిరక్షించాలని DOJను కోరారు. ఇక హిండెన్‌బర్గ్‌కు డీప్‌స్టేట్, డెమోక్రాట్స్, జార్జ్ సొరోస్, చైనా ఇంటెలిజెన్స్ సహకారంపై ఆరోపణలు ఉన్నాయి.
News January 16, 2025
రూ.1,00,00,000 ప్రశ్న.. జవాబు చెప్పగలరా?
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌కు సంబంధించి రూ.కోటి ప్రశ్న వేశారు. 1932లో లార్డ్స్‌లో భారత్ ఆడిన తన తొలి టెస్టులో మొదటి బంతి ఎదుర్కొన్న బ్యాటర్ ఎవరు? అని క్వశ్చన్ అడిగారు. A.జనార్దన్ నవ్లే B.సోరాబ్జీ కోలాహ్ C.లాల్ సింగ్ D.ఫిరోజ్ పలియా అని ఆప్షన్స్ ఇచ్చారు. మరి మీరు సరైన సమాధానం ఏంటో చెప్పగలరా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్: A.