News November 26, 2024
తిరుమల ఆలయ హుండీలో చోరీ
తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీ నుంచి ఓ భక్తుడు నగదు చోరీ చేశాడు. తమిళనాడుకు చెందిన వేణులింగం రూ.15వేలు తీసినట్లు అధికారులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈనెల 23న మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు.
Similar News
News December 11, 2024
చట్టం వారికే చుట్టమా! భార్యా బాధితులకు లేదా రక్షణ?
క్రూరత్వం, గృహహింస నుంచి రక్షణగా స్త్రీల కోసం తెచ్చిన చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భార్య పెట్టిన తప్పుడు కేసులతో పడలేక, చట్టంతో పోరాడలేక నిన్న బెంగళూరు <<14841616>>టెకీ<<>> ప్రాణాలు విడిచిన తీరు కలతపెడుతోంది. చట్టాల్లోని కొన్ని లొసుగులను కొందరు స్త్రీలు ఆస్తి, విడాకుల కోసం వాడుకుంటున్న తీరు విస్మయపరుస్తోంది. ఇలాంటి ట్రెండు ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టూ చెప్పడం గమనార్హం.
News December 11, 2024
వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN
AP: దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. సంక్రాంతి నాటికి ఆర్అండ్‌బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు’ అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.
News December 11, 2024
మా నాన్న చేసిన తప్పు అదే: విష్ణు
తమను అమితంగా ప్రేమించడమే మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది. అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్‌లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.