News February 5, 2025

గురువారం చోరీలు, వీకెండ్‌లో జల్సాలు

image

TG: గచ్చిబౌలి <<15340404>>కాల్పుల కేసులో<<>> అరెస్టయిన బత్తుల ప్రభాకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘సరిపోదా శనివారం’లో నాని ఓ రోజు కోపాన్ని ప్రదర్శించినట్లుగా ప్రభాకర్‌కూ ఓ స్టైల్ ఉంది. వారంలో 3రోజులు ప్లానింగ్, గురువారం చోరీ, వీకెండ్‌లో జల్సాలు చేస్తాడు. ₹10L దొరుకుతాయనుకుంటే రంగంలోకి దిగుతాడు. జీవితంలో ₹335Cr కొట్టేయాలని, 100మంది అమ్మాయిలతో గడపాలనేది ఇతని లక్ష్యమని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Similar News

News February 14, 2025

తులసిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను సీఐడీ అరెస్టు చేసినప్పుడు తులసిబాబు తన గుండెలపై కూర్చొని దాడి చేశాడని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 14, 2025

ప్రేమికుల దినోత్సవం నాడు దారుణం

image

AP: ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. గుర్రంకొండ మం. ప్యారంపల్లికి చెందిన ఓ యువతికి (23)కి ఏప్రిల్ 29న శ్రీకాంత్ అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఆమెను ప్రేమించిన గణేశ్ సైకోలా మారాడు. ఇక ఆమె తనకు దక్కదని భావించి యువతి తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

News February 14, 2025

వాలంటైన్స్ డే: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి అప్డేట్

image

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే పాటను ఈనెల 24న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది.

error: Content is protected !!