News March 30, 2024
వారి పిల్లల స్కూల్ ఫీజు రూ.20.4లక్షలు
ఇటీవల ముంబైలో ధీరూబాయ్ అంబానీ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. అందులో టాప్ సెలబ్రిటీల పిల్లలు సందడి చేశారు. దీంతో ఈ స్కూల్లో ఫీజులు ఎంత ఉంటాయో అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. LKG-7వ తరగతి వరకూ ఫీజు నెలకు రూ.1.70లక్షలు ఉంటుందట. అంటే ఇందులో చదివే రోహిత్‌శర్మ, షారుఖ్, అభిషేక్ బచ్చన్ వంటి వారి పిల్లల ఏడాది ఫీజు రూ.20లక్షలు అన్నమాట. అంటే చాలామంది ఉద్యోగుల ఏడాది జీతం కంటే ఎక్కువే.
Similar News
News November 7, 2024
‘బాహుబలి’ గేటు మూసివేతపై మీరేమంటారు?
TG: సచివాలయ ‘<<14547237>>బాహుబలి<<>>’ గేటును శాశ్వతంగా మూసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తు బాగాలేదనే కారణంతో ఈ చర్యలు చేపట్టినట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది. కాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపలే పెట్టాలని ప్రజలు అడిగారా? రూ.3.2కోట్ల ప్రజాధనం వృథా చేయడమెందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 7, 2024
కిడ్నీ పనితీరుకు ఈ లక్షణాలే సూచనలు
శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో మూత్రపిండాలది కీలక పాత్ర. మరి మన కిడ్నీలు అనారోగ్యంగా ఉన్నాయనడానికి సూచనలేంటి? వైద్య నిపుణుల ప్రకారం.. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఒళ్లు, కాళ్లు నీరు పట్టినట్లు కనిపిస్తున్నా, మూత్రంలో రక్తం వస్తున్నా అనుమానించాల్సిందే. ప్రధానంగా మధుమేహం, బీపీ ఉన్నవారు, ధూమపాన ప్రియులు కచ్చితంగా కిడ్నీ పరీక్షల్ని తరచూ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 7, 2024
ఓర్రీతో TRUMP ఫొటో దిగాల్సిందే.. అంటున్న నెటిజన్లు
సెలబ్రిటీలు తరచూ ఫొటోలు దిగే ఓర్రీ US ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన US సిటిజెన్‌షిప్‌కు సంబంధించిన పత్రాలను కూడా షేర్ చేశారు. ‘మనం సాధించాం ట్రంప్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అదే పోస్టులో ట్రంప్ తనకు మెసేజ్ చేసినప్పుడు తీసిన స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. కాగా ట్రంప్ వచ్చి ఓర్రీతో ఫొటో దిగాల్సిందేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.