News March 30, 2024
వారి పిల్లల స్కూల్ ఫీజు రూ.20.4లక్షలు
ఇటీవల ముంబైలో ధీరూబాయ్ అంబానీ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. అందులో టాప్ సెలబ్రిటీల పిల్లలు సందడి చేశారు. దీంతో ఈ స్కూల్‌లో ఫీజులు ఎంత ఉంటాయో అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. LKG-7వ తరగతి వరకూ ఫీజు నెలకు రూ.1.70లక్షలు ఉంటుందట. అంటే ఇందులో చదివే రోహిత్‌శర్మ, షారుఖ్, అభిషేక్ బచ్చన్ వంటి వారి పిల్లల ఏడాది ఫీజు రూ.20లక్షలు అన్నమాట. అంటే చాలామంది ఉద్యోగుల ఏడాది జీతం కంటే ఎక్కువే.
Similar News
News January 21, 2025
రిజిస్టర్డ్ పార్టీకి, రికగ్నైజ్డ్ పార్టీకి తేడా ఇదే
అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా ఈసీ పరిగణిస్తుంది. ఇలాంటి పార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. వీరికి ఓ తాత్కాలిక గుర్తును కేటాయిస్తారు. అలాగే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లను పొందితే దానిని <<15218607>>గుర్తింపు పొందిన<<>> రాజకీయ పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. ఈ పార్టీలకు గుర్తుతోపాటు కొన్ని ప్రత్యేకాధికారాలను ఈసీ కేటాయిస్తుంది.
News January 21, 2025
అందుకే పనిష్మెంట్ ఇచ్చా: ఈటల
TG: తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి ఎత్తలేదని, బూతులు తిట్టలేదని బీజేపీ MP ఈటల రాజేందర్ అన్నారు. కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో, ధర్మాన్ని కాపాడేందుకు <<15213239>>ఇవాళ పనిష్మెంట్<<>> ఇచ్చానని చెప్పారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా చర్యలు తీసుకుని, ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేశారు.
News January 21, 2025
BIG BREAKING: జనసేనకు ఈసీ గుర్తింపు
జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది. ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఇకపై ఎవరికీ కేటాయించరు. 2014లో ఆవిర్భవించిన జనసేన ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో రాజోలు ఎమ్మెల్యే సీటు గెలిచింది. 2024లో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది.