News January 8, 2025
వారి ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలకు పెంపు
AP: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
Similar News
News January 9, 2025
లోకేశ్.. నీ మీదొక ఫిర్యాదు ఉంది: మోదీ చమత్కారం
AP: విశాఖ పర్యటనలో మంత్రి లోకేశ్‌తో PM మోదీ సరదాగా మాట్లాడారు. ‘లోకేశ్.. నీ మీదొక ఫిర్యాదు ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు అయింది. ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు’ అని చమత్కరించారు. వేదిక వద్ద మోదీని ఆహ్వానించడానికి నిలబడి ఉన్న లోకేశ్ వద్దకు వచ్చిన ఆయన కాసేపు ఆగి ఇలా సరదాగా మాట్లాడారు. కుటుంబంతో ఢిల్లీకి వచ్చి తనను కలవాలని ఆహ్వానించగా త్వరలో వచ్చి కలుస్తానంటూ మంత్రి సమాధానమిచ్చారు.
News January 9, 2025
TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్
AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందడం పట్ల భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ TTD ఛైర్మన్ BR నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో TTD అధికారులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే రోజులన్నీ మరింత అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
News January 9, 2025
నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTR ఇవాళ ACB ఎదుట హాజరుకానున్నారు. సోమవారమే విచారణకు వచ్చిన ఆయన తన లాయర్‌ను లోపలికి అనుమతించడం లేదంటూ తిరిగి వెళ్లిపోయారు. దీంతో అదేరోజు ACB ఆయనకు నోటీసులు జారీ చేసి, 9న విచారణకు రావాలని పేర్కొంది. అటు లాయర్‌కు విచారణ గదిలోకి అనుమతి ఉండదని నిన్న HC స్పష్టం చేసింది. దీంతో KTR ఇవాళ విచారణకు ఒక్కరే వెళ్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.