News December 19, 2024
అమాయకులే వారి ప్రాఫిట్ స్ట్రాటజీ!
Stock Marketలో ఎంత సంపాదించారన్నది తెలియకపోయినా, ఇన్వెస్ట్‌మెంట్ పాఠాల పేరుతో కొందరు రూ.కోట్లు గడిస్తున్నారు. దీంతో అనధికార అడ్వైజరీ బిజినెస్ చేస్తున్న యూట్యూబర్లపై SEBI కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా 19 లక్షల Subscribers ఉన్న రవీంద్ర బాలు భారతీపై చర్యలు తీసుకుంది. అనధికార కార్యకలాపాలతో సంపాదించిన ₹9.5Cr తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మరో ₹10 లక్షలు జరిమానా విధించింది.
Similar News
News January 24, 2025
గోల్డ్ రేట్స్ హైక్
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.82,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.300 పెరిగి రూ.75,550గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.వెయ్యి పెరిగి రూ.1,05,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.
News January 24, 2025
కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అమరావతికి హడ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలనూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌తోనూ బాబు భేటీ అవుతారు.
News January 24, 2025
దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీలోని ఆయన కార్యాలయానికి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ సోదాలు లేదా పలు అంశాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.