News July 17, 2024

వారికి జీతాలు విడుదల

image

AP: కేజీబీవీ టీచర్లు, సీఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు సమగ్రశిక్ష పరిధిలోని ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మే, జూన్ నెలలకు సంబంధించి రూ.122.23 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఉద్యోగుల జీతాలకు రూ.105.2కోట్లు, విద్యార్థుల భోజన నిర్వహణ ఖర్చులకు రూ.17.02 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 12, 2024

పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ కీర్తి సురేశ్

image

హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను గోవాలో పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇవాళ సాయంత్రం మరోసారి వీరి పెళ్లి జరుగుతుంది.

News December 12, 2024

ఇందిరా ఎమర్జెన్సీని తలపించేలా అరెస్టులు: KTR

image

TG: తాండూరులోని గిరిజన హాస్టల్లో అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను అరెస్ట్ చేయడం దారుణమని కేటీఆర్ అన్నారు. పసిబిడ్డలకు కనీసం ఆహారం పెట్టలేని అమానవీయ ప్రభుత్వం అరెస్టుల పేరుతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అడ్డుకోవడం కాకుండా విద్యార్థులకు పోషకాహారం అందించడంపై దృష్టి పెట్టాలని కోరారు.

News December 12, 2024

BREAKING: వైసీపీకి మరో షాక్

image

AP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని <<14855229>>వీడిన<<>> విషయం తెలిసిందే.