News November 30, 2024
అప్పుడు వరి వేస్తే ఉరి.. ఇప్పుడు రూ.500 బోనస్: రేవంత్
TG: గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అంటే, ఇప్పుడు తాము వరి పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది చూసి BRS నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. ఏడాదిలోపే 25 లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. అన్నదాతలకు ఉచిత కరెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో MPగా ఉండి MBNR జిల్లాకు KCR ఏం చేశారో చెప్పాలి’ అని రేవంత్ డిమాండ్ చేశారు.
Similar News
News December 6, 2024
‘గరం మసాలా’ గురించి మీకీ విషయం తెలుసా!
గరం మసాలాతో భారతీయుల బంధం ఈనాటిది కాదు. కొన్ని వేల ఏళ్ల కిందటే ఆహారంలో దీనిని భాగం చేసుకున్నారు. మితంగా తింటే ఔషధంగా పనిచేసే ఈ దినుసుల కోసం యుద్ధాలే జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 36 మసాలా పొడులను పరీక్షించిన టేస్ట్ అట్లాస్ భారతీయ గరం మసాలాకు రెండో ర్యాంకు ఇచ్చింది. ఇక చిలీలో దొరికే చిల్లీ పెప్పర్ అజితో చేసిన పొడికి NO1 ర్యాంకు కట్టబెట్టింది. జాటర్, జెర్క్, షిచిమి టొగారషి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
News December 6, 2024
విజయసాయికి బొలిశెట్టి కౌంటర్
APకి చంద్రబాబు నాయకత్వం వహించలేరని, పవన్ ముందుకు రావాలని <<14805109>>VSR<<>> చేసిన ప్రతిపాదనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ’74 ఏళ్ల గాంధీజీ క్విట్ ఇండియాతో యావత్ దేశాన్ని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడపగా లేనిది CBN APని లీడ్ చేయలేరా? బుర్ర పెట్టి ఆలోచించండి. APని ఎవరు పాలించాలో ప్రజలు నిర్ణయిస్తారు. అది మీ పని కాదు. చేసిన తప్పు ఒప్పుకొని జైలుకెళ్లి శిక్ష అనుభవించి రండి’ అని Xలో కౌంటర్ ఇచ్చారు.
News December 6, 2024
పుష్ప-2 ALL TIME RECORD
అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా కలెక్షన్లు కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ పొందిన ఈ సినిమా తొలిరోజు నైజాంలో ఆల్ టైం రికార్డు సాధించింది. తాజా PR లెక్కల ప్రకారం ఏకంగా రూ.25 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో పుష్ప రాజ్ మాస్ జాతర ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.