News August 22, 2024
అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్
TG: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓ తెలంగాణ సీఎం నిరసన చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2021 నవంబర్ 18న వరి ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటి సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ దగ్గర నిరసనకు దిగారు. ఈరోజు అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈడీ కార్యాలయం దగ్గర CM రేవంత్ నిరసన చేపట్టారు.
Similar News
News September 12, 2024
రెండు రోజులు వైన్స్ బంద్
TG: గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 17 ఉ.6 గంటల నుంచి 18 సా.6 వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులిచ్చారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఇది వర్తించదని పేర్కొన్నారు.
News September 12, 2024
సీతారాం ఏచూరి హైదరాబాద్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందంటే?
సీతారాం ఏచూరి బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్లోనే ఆయన టెన్త్ వరకు చదివారు. 1969లో తెలంగాణలో ఉద్యమం ఉద్ధృతం అవ్వడంతో ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆయన తల్లిదండ్రులు కాకినాడ వాస్తవ్యులు. అందుకే ఆయనకు హైదరాబాద్, TG, APతో అనుబంధం ఎక్కువే. ఈ కారణంతోనే ఎందరో తెలుగువారిని మార్క్సిస్టు పార్టీకి చేరువ చేశారు. జాతీయ నేతలుగా తీర్చిదిద్దారు. TG ఉద్యమంపై ఆయనకెంతో అవగాహన ఉంది.
News September 12, 2024
ఏచూరి.. చట్టసభలో సామాన్యుల గొంతుక
అనారోగ్యంతో <<14084560>>కన్నుమూసిన<<>> సీపీఎం దిగ్గజం సీతారాం ఏచూరి సుదీర్ఘకాలం రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. తొలిసారి ఆయన 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఏచూరి చట్టసభలో సామాన్యుల పక్షాన గొంతెత్తారు. ప్రభుత్వాలపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించేవారు. ప్రస్తుత కమ్యూనిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన ఏచూరికి దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు.