News August 6, 2024

అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్

image

బంగ్లాదేశ్ PM పదవికి రాజీనామా చేసి హసీనా దేశం విడిచి వెళ్లారు. ఆందోళనకారులు ఆమె ఇంట్లోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనే 2022లో శ్రీలంకలో జరిగింది. అధ్యక్షుడు రాజపక్స దేశం విడిచి పారిపోగా ఆయన అధికారిక నివాసంలోకి నిరసనకారులు ప్రవేశించి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. బంగ్లాలో నిరసనలకు రిజర్వేషన్లు కారణమైతే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఆందోళనకు దారి తీసింది.

Similar News

News September 7, 2024

ఆ ప్రాంతాల్లో ఎల్లుండి నుంచి ప్రత్యేక డ్రైవ్: సత్యకుమార్ యాదవ్

image

AP: వరదలతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో లక్ష మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దోమ తెరలు కూడా సరఫరా చేస్తున్నామని, కలుషిత నీటితో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News September 7, 2024

HIGH ALERT: తీవ్ర అల్పపీడనం.. అత్యంత భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది సోమవారానికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. రేపు ఏలూరు, అల్లూరి, ఉ.గో, NTR జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కృష్ణా జిల్లాల్లో భారీ వానలు పడతాయంది. పూర్తి జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 7, 2024

రూ.9 కోట్ల రాయి.. వాకిలి మెట్టుగా వాడిన బామ్మ

image

చెట్ల నుంచి వచ్చే ఒకరకమైన స్రావం గట్టిపడి వేల ఏళ్లకు శిలాజంగా మారుతుంది. దాన్ని అంబర్ అంటారు. ఇది ఎంతో విలువైనది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్లలో ఒకదాన్ని రొమేనియాలో గుర్తించారు. ఓ బామ్మ ఇంటి వాకిట్లో దాన్ని మెట్టుగా వాడేవారు. కొడుకూ దాన్ని సాధారణ రాయిగానే చూశాడు. తర్వాత దాని విలువను గుర్తించి ప్రభుత్వానికి విక్రయించాడు. దాని బరువు 3.5KG. వయసు 7 కోట్ల ఏళ్లని, విలువ ₹9cr ఉంటుందని అంచనా.