News June 3, 2024
రాహుల్ కోసం 2029, 2034 ఎన్నికలు ఉన్నాయి: హర్దీప్ సింగ్
ఈసారి అధికారం తమదే అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేయడాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆయన భ్రమలో ఉన్నారని, మరికొన్ని గంటల్లో వాస్తవాలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయసు చిన్నదేనని.. ఆయన ఎదురుచూడటానికి 2029, 2034 ఎన్నికలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈసారి బీజేపీ 340కిపైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News September 9, 2024
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత
TG: మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. దీంతో హుటాహుటిన ఆయనను గ్రీన్ ఛానెల్ ద్వారా ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 9, 2024
ఏలేరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద
AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ(D) ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 45,019, ఔట్‌ఫ్లో 21,775 క్యూసెక్కులుగా ఉంది. ఏలేశ్వరం- అప్పన్నపాలెం మధ్య కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజుపాలెం వద్ద కాలువకు గండి పడింది. కాండ్రకోట వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కిర్లంపూడి, పెద్దాపురం మండలాల్లో పంటలు నీట మునిగాయి. సమీప గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News September 9, 2024
ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ ఉందని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను అలర్ట్ చేశారు. రేపు ఉదయం 11.30 గంటల వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.