News August 6, 2024
భూమ్మీద ఉన్నవి 6 ఖండాలే: ఇంగ్లండ్ పరిశోధకులు
భూమి మీద 7 ఖండాలున్నాయన్నది ఇన్నాళ్లూ తెలిసిన విషయం. కానీ 6 ఖండాలే ఉన్నాయంటున్నారు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ డెర్బీ పరిశోధకులు. ఐస్‌లాండ్‌లోని అగ్నిపర్వత రాళ్లపై తాము చేసిన అధ్యయనం ప్రకారం ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలు వేరు కాలేదని పేర్కొన్నారు. ఇంకా విడిపోయే దశలోనే ఉన్నాయని వివరించారు. వీటితో పాటు ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ కూడా కలుపుకొని ఒకప్పుడు అతి పెద్ద ఖండం ఉండేదని వారు అంచనా వేశారు.
Similar News
News September 11, 2024
స్టార్ హీరో విడాకులు.. భార్య షాకింగ్ కామెంట్స్
తమిళ హీరో జయం రవి <<14058198>>విడాకులు<<>> తీసుకున్నట్లు ప్రకటించడంపై ఆయన భార్య ఆర్తి రవి విచారం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే ఈ ప్రకటన చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయమై తన భర్తతో మాట్లాడుదామని అనుకున్నా అవకాశం లేకపోయిందని వాపోయారు. తన వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ క్లిష్ట సమయంలో పిల్లల సంరక్షణపై దృష్టి పెడుతానని చెప్పారు.
News September 11, 2024
20 కి.మీ వరకూ నో టోల్.. ఇలా!
జాతీయ రహదారులపై 20 కి.మీ. వరకూ ఎలాంటి <<14068203>>టోల్<<>> ఛార్జీ లేకుండా ఉచితంగా వెళ్లొచ్చు. 20 కి.మీ దాటాక ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనదారులు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకోవాల్సి ఉంటుంది. టోల్ రోడ్డుపై వాహనం ఎంత దూరం ప్రయాణించిందో ఆన్ బోర్డ్ యూనిట్ల ద్వారా జీపీఎస్ కోఆర్డినేట్లు రికార్డు అవుతాయి. దీంతో టోల్ ఛార్జీ నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.
News September 11, 2024
ఈ క్రికెటర్ ఎవరో చెప్పుకోండి చూద్దాం!
క్రికెట్ ప్రేమికులకో పజిల్. పై ఫొటోలో ఓ లెజెండరీ బౌలర్ ఉన్నారు. వన్డేల్లో 300కి పైగా మెయిడిన్ ఓవర్లు వేసిన ఒకే ఒక క్రికెటర్ అతడు. వందకు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు, 13 ఐపీఎల్ మ్యాచులు ఆడారు. IPLలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆ లెజెండరీ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి.
**సరైన సమాధానం మ.ఒంటి గంటకు ఇదే ఆర్టికల్‌లో చూడండి.