News April 1, 2024
ఫోన్ ట్యాపింగ్‌లో పెద్ద నేతలు ఉన్నారు: ఉత్తమ్

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద నేతలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ‘నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో త్వరలోనే తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్లారు. వారి సర్కారు గొర్రెల స్కామ్ చేసింది. ఆ పార్టీ త్వరలోనే మొత్తం ఖాళీ కావడం ఖాయం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 24, 2026
అమెరికాలో 40 శాతం పెరిగిన డీజిల్ ధరలు

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఆ దేశానికి ₹లక్షల కోట్లు ఖర్చవుతోంది. మరోవైపు డీజిల్ ధరలు 40 శాతం మేర పెరిగాయి. గ్యాలన్ ధర $5.29కు(ఒక గ్యాలన్=3.78 లీటర్లు) చేరుకుంది. 2022 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నుంచి రోజుకు 10-15 లక్షల బ్యారెళ్లను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది క్రమంగా 30 లక్షలకు చేరుకోవచ్చన్నారు.
News March 24, 2026
ధురంధర్-2 ధమాకా.. ₹800కోట్లు దాటిన గ్లోబల్ కలెక్షన్లు

బాక్సాఫీసుపై ధురంధర్-2 దండయాత్ర కొనసాగుతోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లో ₹430కోట్ల నెట్ వసూలు చేసి పుష్ప-2 హిందీ వెర్షన్ (₹425.10కోట్లు) రికార్డ్ బ్రేక్ చేసింది. ఐదురోజుల్లో దేశంలో ఈ మూవీ గ్రాస్ ₹619.76కోట్లు ఉండగా గ్లోబల్ కలెక్షన్లలో గ్రాస్ ₹829.76కోట్లకు చేరినట్లు Sacnilk తెలిపింది. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో ధురంధర్-2 ₹1000కోట్ల మార్క్ చేరే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా.
News March 24, 2026
రూ.10వేలు తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర క్రమంగా తగ్గుతోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.10,000 పతనమై రూ.2,40,000కు చేరింది. శుభకార్యాల వేళ వారం రోజుల్లోనే కేజీ సిల్వర్ రేటు రూ.40,000 తగ్గి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పతనమవుతున్న ఈ ధరలు ఇన్వెస్టర్లకు నష్టాలనిస్తున్నాయి.


