News October 7, 2025
ఆ స్కూళ్లల్లో 40లోపే విద్యార్థులు.. త్వరలో టీచర్ల సర్దుబాటు!

AP: విద్యార్థుల సంఖ్య 40లోపు ఉన్న ఎయిడెడ్ స్కూళ్లు రాష్ట్రంలో 251 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా ప్రకాశంలో 35, గుంటూరులో 29, బాపట్ల 26, కడప 18 స్కూళ్లు, అత్యల్పంగా అనకాపల్లి, కర్నూలులో 2 చొప్పున ఉన్నాయి. ఈ స్కూళ్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఈ పాఠశాలల్లో పని చేసే మిగులు ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయనున్నారు.
Similar News
News October 7, 2025
ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త

రాబోయే 4-6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇంధనం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా దిగుమతుల రూపంలో ఏడాదికి రూ.22 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నం.1 చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ విలువ రూ.22 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు.
News October 7, 2025
అధికారికంగా కొమురం భీం వర్ధంతి.. ఇవాళ స్కూళ్లకు సెలవు

TG: గిరిజనుల ఆరాధ్యుడు కొమురం భీం వర్ధంతిని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 85వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌లో NOV 8, ఆదిలాబాద్‌లో DEC 13న(రెండో శనివారాలు) స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.
News October 7, 2025
NHRDFలో ఉద్యోగాలు

నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (NHRDF)14 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 2లోపు అప్లై చేసుకోగలరు. జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ ఆఫీసర్, అకౌంటెంట్, సెక్షన్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో PhD, మాస్టర్ డిగ్రీ, MBA, బీకామ్/బీఏతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: http://nhrdf.org/