News September 11, 2024
పంట అమ్ముకునేందుకు ఎన్నో అడ్డంకులు

AP: రైతులు పంట పండించడం కంటే అమ్ముకునేందుకే ఎక్కువ కష్టపడుతున్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు నిర్దేశించిన మార్గదర్శకాలు అన్నదాతలకు ఇబ్బందిగా మారాయి. ఈ-క్రాప్‌లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే పంట అమ్ముకోలేరు. రైతు సేవా కేంద్రంలో చెప్పిన రోజే మిల్లుకు తీసుకెళ్లాలి. వ్యవసాయశాఖ అంచనా వేసిన దిగుబడి కంటే ఎక్కువగా వస్తే అంగీకరించరు. ఈ నిబంధనలను సడలించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Similar News
News February 12, 2026
నేను ట్యాపింగ్ చేయడం లేదు: రేవంత్ రెడ్డి

తాను ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని TG సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. ‘ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుంది. కాల్స్ వినడం ఓ మానసిక రోగం. SIB పేరిట రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినిమా వాళ్లు, బిజినెస్‌మెన్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రభుత్వం మారగానే హార్డ్‌వేర్లు మాయం చేశారు. KCR విచారణతో ఈ కేసు క్లైమాక్స్‌కు చేరిందని అనుకోవడం లేదు’ అని తెలిపారు.
News February 12, 2026
సింగరేణి నిబంధనలు మార్చింది కేంద్రమే: CM

TG: సింగరేణి టెండర్ల నిబంధనల్లో 2018లోనే కేంద్రం మార్పులు చేసిందని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘సైట్ విజిట్ పర్మిషన్ తీసుకోవాలని అప్పుడే పెట్టారు. దీన్ని నిరూపిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా? సింగరేణే కాదు కోల్ ఇండియా కూడా నష్టాల్లో ఉంది. సింగరేణి సంస్థ జెన్‌కోకు కూడా బొగ్గు సరఫరా చేసింది. అమాయకుడిని కాబట్టి నాపై నిందలు వేస్తున్నారు. KCRను ఎందుకు అడగడం లేదు’ అని ప్రశ్నించారు.
News February 12, 2026
T20 WC: పాక్ మ్యాచుకూ అభిషేక్ దూరం?

టీమ్‌ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే నమీబియాతో మ్యాచుకు దూరమైన అభిషేక్ మరో మ్యాచుకూ దూరమవ్వొచ్చని టాస్ సమయంలో SKY చెప్పారు. దీంతో ఈ నెల 15న పాక్‌తో మ్యాచుకు అభిషేక్ అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆడకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.


