News November 7, 2024

ఆ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు!

image

మన పొరుగు దేశం భూటాన్‌లో నిలువ నీడ లేనివారు, బిచ్చగాళ్లు ఏమాత్రం కనిపించరు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో క్రమం తప్పకుండా చోటు సంపాదించే అక్కడ ప్రజల అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. వారికి నివాసం, భూమి, ఆహార భద్రత వంటివన్నీ చూసుకుంటుంది. దీంతో ఇతర దేశాల్లో కనిపించే సహజమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అన్నట్లు ఇక్కడ వైద్య చికిత్స ఉచితం కావడం విశేషం.

Similar News

News December 6, 2024

రేపు నటి, నటుడి పెళ్లి

image

తెలుగు నటుడు సాయి కిరణ్ 46 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకోబోతున్నారు. సీరియల్ నటి స్రవంతితో రేపు ఆయన పెళ్లి జరగనుంది. ‘నువ్వే కావాలి’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ పలు సినిమాల్లో హీరోగా, సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సాయి కిరణ్ తొలి వివాహం 2010లో వైష్ణవి అనే మహిళతో జరిగింది. వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కూతురు ఉంది.

News December 6, 2024

జగన్ పాలన.. దళితులకు నరకయాతన: లోకేశ్

image

AP: గత టీడీపీ హయాం(2014-19)తో పోలిస్తే వైసీపీ పాలనలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘జగన్ జమానాలో దళితులపై దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. జే బ్రాండ్స్‌పై పోరాడినందుకు హత్యలు చేశారు. ఇసుక అక్రమాలపై నోరెత్తినందుకు శిరోముండనం చేశారు. జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా దేశానికి తెలిసింది’ అంటూ ఆయన Xలో పోస్ట్ చేశారు.

News December 6, 2024

నెల రోజుల్లోపే OTTల్లోకి సినిమాలు!

image

థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే కొన్ని సినిమాలు OTTలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల మట్కా(21 రోజులు), లక్కీ భాస్కర్ (28), క (28) నెలరోజుల్లోపే OTTలోకి రాగా నవంబర్ 14న థియేటర్లలో రిలీజైన ‘కంగువ’ 28 రోజుల్లోపే (DEC8 న) OTTలోకి రానుంది. అమరన్ 35 రోజుల్లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే, నెల రోజుల్లో ఎలాగో OTTకి వస్తుందన్న భావనతో జనం థియేటర్లకు రారని పలువురు సినీ ప్రియులు అంటున్నారు.