News January 3, 2025
2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు!

TG: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని డీఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక(2023-2024) తేల్చిచెప్పింది. పశ్చిమ బెంగాల్(3254), రాజస్థాన్(2187) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2వేల పైచిలుకు ఉండటం ఆందోళనకరం.
Similar News
News October 24, 2025
‘గూగుల్ తల్లి’ గుండెల్లో Ai గుబులు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఇకపై టెస్టింగ్ టైమ్. చాట్ GPT ఈమధ్యే అట్లాస్ Ai బ్రౌజర్ లాంఛ్ చేయగా మైక్రోసాఫ్ట్ తన కోపైలట్ సాఫ్ట్‌వేర్‌ను ఎడ్జ్ బ్రౌజర్లో ఇంటిగ్రేట్ చేస్తోంది. కాగా ఇప్పటికే జెమిని Aiని బ్రౌజర్లో గూగుల్ చేర్చి సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తోంది. కానీ యూజర్లు ఇక్కడే కంటెంట్ పొంది సైట్లకు వెళ్లక యాడ్ రెవెన్యూపై ప్రభావం పడుతోందట. అటు పోటీ ఇటు ఆర్థిక పోట్లతో గూగుల్‌కు డెంట్ తప్పదు అన్పిస్తోంది.
News October 24, 2025
పాక్‌కు షాక్.. నీళ్లు వెళ్లకుండా అఫ్గాన్‌లో డ్యామ్!

పాక్‌కు నీళ్లు వెళ్లకుండా నియంత్రించాలని అఫ్గాన్ ప్లాన్ చేస్తోంది. కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తాలిబన్ సుప్రీంలీడర్ మౌలావీ హైబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలిచ్చారు. విదేశీ కంపెనీల కోసం చూడకుండా దేశీయ కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలని సూచించారు. 2 దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత <<16207281>>సింధూ జలాల<<>> ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం తెలిసిందే.
News October 24, 2025
వారు మున్సిపాలిటీల్లోనూ పోటీ చేయొచ్చు!

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్‌తో పాటు పురపాలక చట్టాలను కూడా సవరించనున్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆర్డినెన్స్‌ను ఇవాళ ప్రభుత్వం గవర్నర్‌కు పంపనుంది.


