News January 3, 2025
2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు!
TG: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని డీఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక(2023-2024) తేల్చిచెప్పింది. పశ్చిమ బెంగాల్(3254), రాజస్థాన్(2187) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2వేల పైచిలుకు ఉండటం ఆందోళనకరం.
Similar News
News January 13, 2025
సంక్రాంతి వేడుకల ఫొటోలను పంచుకున్న మోదీ
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్‌లో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి, పొంగల్‌ను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఈ పండగ భారతీయ వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంగా ప్రజలు ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
News January 13, 2025
GOOD NEWS: పీఎం కిసాన్ రూ.10,000లకు పెంపు?
పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుండగా రూ.10,000లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.10వేలతో పాటు తాము మరో రూ.10వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పారు.
News January 13, 2025
పసుపు బోర్డుతో ఉపయోగాలివే
కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, మార్కెట్ వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడానికి అవసరమైన యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం ఉంటుంది. తెలంగాణవ్యాప్తంగా ప్రతి సీజన్‌లో దాదాపు 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. కాగా రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు <<15148521>>ప్రారంభోత్సవం<<>> జరగనుంది.