News May 12, 2024
అక్కడ 10 మందే ఓటర్లు!

TG: రాష్ట్రంలోని మారుమూల తండాలు, గూడేల్లోని ఓటర్ల కోసం ఈసీ ఈసారి 328 ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 61 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 100లోపే ఉంది. నాగర్ కర్నూల్ లోక్సభ పరిధి అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంటులోని మన్ననూరులో అతితక్కువగా 10 మంది ఓటర్లుండగా, ఉప్పునుంతల, బక్కలింగాయపల్లిలో అత్యధికంగా 100 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


