News August 31, 2024

కఠిన చట్టాలు ఉన్నాయి.. అమలు చేయండి: మమతకు కేంద్ర మంత్రి సూచన

image

మహిళలపై నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నాయని, వాటిని అమలు చేయాలని సీఎం మమతా బెనర్జీని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి కోరారు. ఈ విషయమై ప్రధానికి మమత రెండోసారి లేఖ రాయడంపై కేంద్ర మంత్రి స్పందించారు. రేప్, పోక్సో కేసుల విచారణకు ఏర్పాటు చేసిన 11 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను బెంగాల్ ప్రభుత్వం నడిపించడం లేదని ఆరోపించారు. బెంగాల్‌లో 48 వేల రేప్, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు.

Similar News

News September 15, 2024

రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసిన నాని మూవీ

image

వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు దాటినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పుడు సరిపోయిందంటూ రాసుకొచ్చింది. గత నెల 29న థియేటర్లలో విడుదలైన ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూవీలో సూర్య నటన, జేక్స్ బెజోయ్ మ్యూజిక్‌కు సినీ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

News September 15, 2024

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

image

TG: ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారో? లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ CM రేవంత్ రెడ్డికి KTR లేఖ రాశారు. ‘ప్రాజెక్టును రద్దు చేస్తే భూములు ఇచ్చిన రైతులకు తిరిగి వారి భూములు అప్పగించండి. ఆ భూముల్ని ఇతర అవసరాలకు వాడితే చట్టపరంగా సమస్యలు తప్పవు. అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో HYDను నం.1గా చేసేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టాం. రాజకీయాల కోసం TG యువతకు నష్టం చేయొద్దు’ అని లేఖలో పేర్కొన్నారు.

News September 15, 2024

ఇడ్లీ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

image

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇడ్లీ తినడం వల్ల చనిపోయారు. ఓనం పండుగ సందర్భంగా అక్కడ పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సురేశ్(49) అనే వ్యక్తి ఇడ్లీలు తినే పోటీలో పాల్గొన్నారు. ఒకేసారి మూడు ఇడ్లీలు తినగా అవి గొంతులో ఇరుక్కున్నాయి. ఊపిరాడక కుప్పకూలిన అతన్ని నిర్వాహకులు ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.