News August 11, 2024
మూడు ఫార్మాట్లలో ఆడాలని ఉంది: సూర్య

భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాలని ఉందని టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మనసులో మాట బయటపెట్టారు. టెస్టుల్లో ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ పనికొస్తుందని ఆయన చెప్పారు. కాగా T20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్య వన్డేల్లో మాత్రం తేలిపోతున్నారు. పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్నారు. వన్డేలతోపాటు టెస్టులకూ ఆయనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవటం లేదు. SKY ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడారు.
Similar News
News July 6, 2025
ఉపవాసంతో ఎన్ని లాభాలంటే?

పుణ్యం కోసం చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*శరీరం డీటాక్సిఫై అవుతుంది
*జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
*ఉపవాసంలో పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది
*శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు
News July 6, 2025
టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.
News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.