News January 20, 2025
‘హిండెన్‌బర్గ్’ అండర్సన్‌పై మోసం కేసు నమోదుకు ఆస్కారం!

US షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ యజమాని అండర్సన్‌పై సెక్యూరిటీ ఫ్రాడ్ కేసు నమోదవ్వొచ్చని సమాచారం. కంపెనీలే టార్గెట్‌గా రిపోర్టులు రూపొందించేందుకు హెడ్జ్‌ఫండ్ కంపెనీలతో కుమ్మక్కైనట్టు ఆంటారియో కోర్టులో దాఖలైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. షేర్ల ట్రేడింగులో పాల్గొంటున్నట్టు చెప్పకుండా బేరిష్ రిపోర్టులను రూపొందించడం US SEC ప్రకారం నేరమని ఆ నివేదిక నొక్కిచెప్పింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం తెలిసిందే.
Similar News
News October 21, 2025
నేవీ చిల్డ్రన్ స్కూల్లో ఉద్యోగాలు

నేవీ చిల్డ్రన్ స్కూల్ 8 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమాతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 21 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్సైట్: https://ncsdelhi.nesnavy.in/
News October 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 42 సమాధానాలు

1. వాలి ఇంద్రుడి అంశతో జన్మించాడు.
2. కర్ణుడి అంత్యక్రియలను యుధిష్ఠిరుడు నిర్వహించాడు.
3. జ్ఞానానికి, విద్యకు అధిదేవత సరస్వతీ దేవి.
4. త్రిమూర్తులలో లయకారుడు ‘శివుడు’.
5. వాయు లింగం శ్రీకాళహస్తి ఆలయంలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 21, 2025
మీ జుట్టు పొడిబారిందా? ఇలా చేయండి

థైరాయిడ్, PCOS, డయాబెటిస్ వల్ల చర్మం, జుట్టూ పొడిబారుతుంది. దీన్ని నివారించడానికి గాఢత తక్కువగా ఉండే షాంపూలను వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘సల్ఫేట్ ఫ్రీ ఫార్ములా ఉన్న మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంపిక చేసుకోవాలి. ప్రొడక్టుల్లో హైలురనిక్ యాసిడ్, స్క్వాలిన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. చుండ్రు నివారణకు కీటోకొనజాల్, సెలీనియం సల్ఫైడ్, సాల్సిలిక్ యాసిడ్ ఉన్న లోషన్లను వాడాలి’ అని చెబుతున్నారు.