News March 27, 2025
ప్రభుత్వ ఆఫీసుల్లో AI వినియోగంపై నిషేధం లేదు: కేంద్రమంత్రి

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్లైన్స్కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.
Similar News
News March 30, 2025
దొడ్డు బియ్యంతో రూ.10వేల కోట్ల దోపిడీ: రేవంత్

TG: 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ పథకాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. దానినే ఎన్టీఆర్ కొనసాగించారని హుజూర్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు. పేదలు అన్నం తినాలని గతంలో 90 పైసలకే బియ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10వేల కోట్ల దోపిడీ జరుగుతోందన్నారు. దీంతో మిల్లర్ల మాఫియా విస్తరిస్తోందన్నారు. పేదలు తినాలనే సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు.
News March 30, 2025
కోల్కతా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్

కేకేఆర్ ఫ్యాన్స్కు ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ గుడ్ న్యూస్ చెప్పారు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అనారోగ్యం కారణంగా ఆడని సునీల్ నరైన్ కోలుకున్నారని ఆయన తెలిపారు. రేపు వాంఖడేలో ముంబైతో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కాగా.. RRతో మ్యాచ్లో నరైన్ స్థానంలో ఆడిన మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు.
News March 30, 2025
ఈ పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే: మంత్రి ఉత్తమ్

TG: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఉచిత సన్న బియ్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ పథకం గురించి దేశమంతా చర్చించుకోవాలనే తన నియోజకవర్గంలో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హుజూర్ నగర్లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా తెలంగాణే ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని, దీంతో పక్కదారి పడుతోందని పేర్కొన్నారు.