News October 22, 2024
టారిఫ్ రేట్లు పెంచే అవకాశమే లేదు: BSNL CMD
ప్రైవేట్ టెలికం సంస్థల కంటే తక్కువ ధరకే టారిఫ్‌లను అందిస్తున్న BSNL మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పట్లో రేట్లను పెంచే అవకాశమే లేదని సంస్థ CMD రాబర్ట్ రవి వెల్లడించారు. వినియోగదారుల విశ్వాసం పొందడం, వారిని సంతోషంగా ఉంచడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే 4G సేవలను ప్రారంభించామని, ఈ డిసెంబర్ లోపు దేశవ్యాప్తంగా వాటిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టిసారించామని తెలిపారు.
Similar News
News January 2, 2025
కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు
బస్సు టికెట్ ధరలను 15% పెంచేందుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. KSRTC, BMTC బస్సుల్లో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని మంత్రి HK పాటిల్ తెలిపారు. రేట్లు పెంచినా ఏపీ, తెలంగాణ, MH కంటే కర్ణాటకలోనే ఛార్జీలు తక్కువగా ఉంటాయన్నారు. కాగా, కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం వల్ల నెలకు రూ.417 కోట్లు ఖర్చవుతోంది. తాజాగా రేట్ల పెంపుతో రోజుకు రూ.8 కోట్ల అదనపు ఆదాయం రానుంది.
News January 2, 2025
సిడ్నీ టెస్ట్: ఈ ముగ్గురి నుంచే ముప్పు?
BGT ఐదో టెస్ట్ జరగనున్న సిడ్నీలో ఆస్ట్రేలియా బ్యాటర్లు స్మిత్, ఖవాజా, లబుషేన్‌కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ స్మిత్ భారత్‌పై 4 ఇన్నింగ్స్‌లలో 400 రన్స్ చేశారు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలున్నాయి. ఖవాజా మొత్తంగా 12 ఇన్నింగ్స్‌ల్లో 832, లబుషేన్ 10 ఇన్నింగ్స్‌ల్లో 734 పరుగులు చేశారు. ఈ ముగ్గురిని త్వరగా ఔట్ చేస్తేనే భారత్ గెలిచేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు.
News January 2, 2025
JAN 3న రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
TG: ఏటా జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సావిత్రిబాయి ఫూలే జయంతిని ‘మహిళా టీచర్స్ డే’గా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఈ దినోత్సవాన్ని జరిపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. సావిత్రిబాయి ఫూలే జయంతిని ఇప్పటికే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.