News October 22, 2024

టారిఫ్ రేట్లు పెంచే అవకాశమే లేదు: BSNL CMD

image

ప్రైవేట్ టెలికం సంస్థల కంటే తక్కువ ధరకే టారిఫ్‌లను అందిస్తున్న BSNL మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పట్లో రేట్లను పెంచే అవకాశమే లేదని సంస్థ CMD రాబర్ట్ రవి వెల్లడించారు. వినియోగదారుల విశ్వాసం పొందడం, వారిని సంతోషంగా ఉంచడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే 4G సేవలను ప్రారంభించామని, ఈ డిసెంబర్ లోపు దేశవ్యాప్తంగా వాటిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టిసారించామని తెలిపారు.

Similar News

News November 8, 2024

‘పుష్ప-2’: స్పెషల్ సాంగ్‌లో శ్రీలీలతో పాటు మరో బ్యూటీ!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమాలోని స్పెషల్ సాంగ్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్‌లో నటిస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, సమంత సైతం అతిథిగా సాంగ్‌లో కనిపించాల్సి ఉందని, కానీ ఆమె ప్లేస్‌లో ఓ బాలీవుడ్ నటికి ఛాన్స్ వచ్చిందని వెల్లడించాయి. కాగా సాంగ్ షూట్‌తో సినిమా షూటింగ్ పూర్తికానుండగా DEC 5న మూవీ విడుదల కానుంది.

News November 8, 2024

మ్యూజిక్ డైరెక్టర్ స్థలం కబ్జా: ప్రభుత్వం స్వాధీనం

image

TG: సంగీత దర్శకుడు చక్రవర్తికి ఎన్టీఆర్ హయాంలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నం.14లో 20 గుంటల స్థలం కేటాయించారు. ఈ స్థలంలో చక్రవర్తి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆయన కుమారుడు కూడా ఈ స్థలాన్ని గాలికొదిలేశారు. దీంతో 40 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న రూ.65 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. విషయం తెలుసుకున్న షేక్ పేట్ రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.

News November 8, 2024

అందుకే కేటీఆర్‌ను అరెస్ట్ చేయట్లేదు: బండి

image

TG: కేటీఆర్‌తో కుదిరిన ఒప్పందం‌తోనే ఆయనను రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. CM పాదయాత్ర చేయాల్సింది మూసీ నది పక్కన కాదని ఇళ్లు కూల్చిన ప్రాంతంలో అని ఎద్దేవా చేశారు. BJPకి స్పేస్ లేకుండా కాంగ్రెస్, BRS డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులపై హంగామా చేశారన్నారు. ఇప్పుడు ఎలాంటి చప్పుడు లేదన్నారు.