News December 29, 2024

జనవరి 1న సెలవు లేదు

image

జనవరి 1న ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.

Similar News

News January 22, 2025

నేను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో: డివిలియర్స్

image

తాను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో అనే అనుభూతి చెందుతున్నట్లు డివిలియర్స్ చెప్పారు. బంతిని ఊచకోత కోసే ఇతను గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నా కళ్లు ఇంకా పని చేస్తున్నాయి. గ్రౌండ్‌కు వెళ్లి బంతులను కొడుతూ మళ్లీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు. దీంతో త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని ఏబీ ఫ్యాన్స్ SMలో కామెంట్లు పెడుతున్నారు.

News January 22, 2025

నేడే ఇంగ్లండ్‌తో తొలి T20.. కళ్లన్నీ షమీపైనే

image

స్వదేశంలో ఇంగ్లండ్‌తో 5T20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్ తొలి T20 కోల్‌కతాలో ఆడనుంది. SKY సారథ్యంలో ధనాధన్ ఆటకు జట్టు సిద్ధమైన వేళ స్టార్ పేసర్ షమీపైనే కళ్లన్నీ ఉన్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టులో చేరిన షమీ ఆశించిన స్థాయిలో రాణిస్తే CTలో భారత్‌కు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా మారనున్నారు. అటు విజయంతో సిరీస్ ప్రారంభించాలని ఇంగ్లండ్ వ్యూహాలు రచిస్తోంది. రాత్రి 7 గం.కు స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ లైవ్ చూడవచ్చు.

News January 22, 2025

27మంది మావోలు మృతి.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి

image

ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చలపతి(60) ఉన్నారు. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా మాటెంపల్లి కాగా, రూ.కోటి రివార్డ్ ఉంది. చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.