News May 7, 2025
వారిని వదిలే ప్రసక్తే లేదు: అర్చకులు రంగరాజన్

TG: తనపై దాడి చేసిన వారిని వదలబోనని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు. FEB 7న తాను స్నానానికి వెళ్తూ.. ఇప్పుడు ఎవరినీ కలవబోనని చెప్పగానే 20 మంది తలుపులు తోసుకొని ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. రామరాజ్యం కోసం పనిచేసే వారిని కలవడానికి టైం లేదా? అంటూ వారు తనను కిందపడేసి దాడి చేశారన్నారు. దాన్ని తేలికగా తీసుకొనే ప్రసక్తే లేదని, కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానని ఆయన తెలిపారు.
Similar News
News August 13, 2025
అత్యవసరమైతేనే బయటకు రండి: హైడ్రా

TG: హైడ్రా పరిధిలో నేటినుంచి మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. మేడ్చల్, సైబరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో వాహనాల వాడకం తగ్గించాలని, సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040 29560521, 9000113667, 9154170992.
News August 13, 2025
నేడు ED విచారణకు మంచు లక్ష్మి

TG: సినీ నటి మంచు లక్ష్మి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆమెను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
News August 13, 2025
జాగ్రత్త.. నేటి నుంచే అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు, రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది?