News July 24, 2024
పస లేదు.. అధికారపక్షమే.. ప్రతిపక్షమైన వేళ!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగుతున్నాయి. ప్రతిపక్షం లేకపోవడమే ఇందుకు కారణం. గత పదేళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్కూ వైసీపీ హాజరు కాలేదు. కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ప్రతిపక్షం లేకుండానే చర్చ సాగింది. అధికారపక్ష సభ్యులే ప్రతిపక్షమై ప్రశ్నలు సంధించగా మంత్రులు సమాధానమివ్వడంతో చర్చల్లో పస కనిపించడం లేదు.
Similar News
News December 11, 2025
ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.
News December 11, 2025
మీకంటే అసద్ యాక్టివ్: T BJP ఎంపీలతో మోదీ

తెలంగాణలో BJP MPలు సరైన ప్రతిపక్షపాత్ర పోషించలేకపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తంచేశారు. అసదుద్దీన్ సోషల్ మీడియా టీమ్ యాక్టివ్గా ఉందని ఉదహరించారు. వారి పనితీరు మారాలని, SMలో చురుగ్గా ఉండాలని హితబోధ చేశారు. AP, TGల NDA MPలకు అల్పాహార విందులో మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన భేష్ అంటూ ఈ భేటీలో కితాబు ఇచ్చారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
News December 11, 2025
చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.


