News January 12, 2025
రాష్ట్రంలో సంక్రాంతి సందడి లేదు: YCP

AP: రాష్ట్రంలో సంక్రాంతి సందడి కానరావడం లేదని వైసీపీ ట్వీట్ చేసింది. ‘ప్రజల చేతుల్లో డబ్బుల్లేక ఎక్కడా కొనుగోళ్లు లేవు. దిగువ మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బు ఆడడం లేదు. దీంతో పండగ షాపింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగనన్న ఉండి ఉంటే తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవని, దాంతో పండగ గడిచిపోయేదని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు పండగ చప్పగా ఉందని చెబుతున్నారు’ అని పేర్కొంది.
Similar News
News February 18, 2025
SSMB29 రెండో షెడ్యూల్ షురూ

రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం SSMB29 షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివారులో నిర్మించిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోదరుడి వివాహం కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఈ వేసవిలో విదేశాల్లో షూటింగ్‌కు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
News February 18, 2025
భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్

భారత్-పాక్ సరిహద్దుల్లోని పీర్‌పంజల్ ప్రాంతంలో(J&K) నియంత్రణ రేఖ(LOC) వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్(BAT) కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడమే దీనిక్కారణం. సరిహద్దు ఆవలి నుంచి కాల్పులు జరుపుతూ భారత బలగాల్ని రెచ్చగొట్టేందుకు పాక్ యత్నిస్తోంది. మరోవైపు.. సీజ్‌ఫైర్ ఉల్లంఘన జరగలేదని, అధికారికంగా అమల్లోనే ఉందని భారత్ చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.
News February 18, 2025
నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.