News September 13, 2024

ఈ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు లేదు

image

AP: గుంటూరు జిల్లా వ్యాప్తంగా రేపు స్కూళ్లు యథావిధిగా పనిచేస్తాయని DEO శైలజా ఆదేశాలు జారీ చేశారు. 2వ శనివారమైనా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వర్కింగ్‌డేగా ప్రకటించారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో రేపు వర్కింగ్ డే‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవు రద్దు చేయడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

Similar News

News January 19, 2026

శివపార్వతుల నిత్య నివాసం, మోక్ష క్షేత్రం ‘వారణాసి’

image

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు కైలాసం వదిలి గంగాతీరంలోని కాశీని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. అందుకే కాశీ శివపార్వతుల గృహంగా, మోక్ష నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. జీవన్మరణాల సంగమమైన ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.

News January 19, 2026

సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

image

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!

News January 19, 2026

24% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

image

భారత్ నుంచి 2025లో ఆటోమొబైల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2024లో 50,98,474 వాహనాల ఎగుమతి జరగ్గా.. గతేడాది ఆ సంఖ్య 63,25,211(24.1%)కు చేరింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 16%, యుటిలిటీ వెహికల్స్ 32శాతం, కార్ల ఎగుమతులు 3% మేర పెరిగాయి. వీటిలో 3.95 లక్షల యూనిట్లు ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది.