News September 13, 2024
ఈ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు లేదు
AP: గుంటూరు జిల్లా వ్యాప్తంగా రేపు స్కూళ్లు యథావిధిగా పనిచేస్తాయని DEO శైలజా ఆదేశాలు జారీ చేశారు. 2వ శనివారమైనా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వర్కింగ్‌డేగా ప్రకటించారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో రేపు వర్కింగ్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవు రద్దు చేయడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
Similar News
News October 10, 2024
‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం
AP: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీసేవ, గ్రామ-వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News October 10, 2024
రతన్ టాటా అందుకున్న పురస్కారాలు
రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ఠ సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(UK), ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో ఉన్నాయి.
News October 10, 2024
నేడు క్యాబినెట్ భేటీ
AP: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం కానుంది. చెత్త పన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, దేవాలయాలకు పాలక మండళ్ల నియామకం, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాలపై చర్చించే అవకాశముంది.