News January 28, 2025

సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు: అంబటి ఎద్దేవా

image

AP: పథకాల అమలుపై సీఎం చంద్రబాబు చేసిన <<15282237>>కామెంట్లకు<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో కౌంటరిచ్చారు. ‘సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు. జగన్ మీద తోసేసి చంద్రబాబు, లోకేశ్ చేతులెత్తేశారు. హామీలు గాలికి వదిలేశారు. గోవిందా.. గోవిందా!!’ అని ఎద్దేవా చేశారు. అప్పుల పేరుతో CBN పథకాలు అమలు చేయడం లేదని అంబటి నిన్న విమర్శించిన విషయం తెలిసిందే.

Similar News

News December 12, 2025

ఇంటి చిట్కాలు మీకోసం

image

* గుడ్డులోని సొన కింద పడితే ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మరక ఆనవాళ్ళు ఉండవు.
* గాజు వస్తువులపై ఉప్పు చల్లి నీళ్ళతో రుద్దితే కొత్తగా మెరిసిపోతాయి.
* ఇనుప వస్తువులను ఉప్పుతో రుద్ది పొడి క్లాత్‌తో తుడిచి భద్రపరిస్తే ఎక్కువకాలం మన్నుతాయి.
* నిమ్మరసం, ఉప్పుతో రాగిసామగ్రిని రుద్దితే మెరిసిపోతాయి.
* చీమలు వచ్చే రంధ్రం దగ్గర కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే వాటి బెడద తగ్గుతుంది.

News December 12, 2025

రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న వినేశ్ ఫోగట్.. టార్గెట్ ఒలింపిక్స్

image

మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు SMలో వెల్లడించారు. 2028 లాస్ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటానన్నారు. ‘ఆశయాలు, అంచనాల ద్వారా వచ్చిన ఒత్తిడితో ఆటకు దూరమయ్యాను. రెజ్లింగ్‌ను ఇంకా ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాను. 18 నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నాను. ఈసారి నా కొడుకుతో కలిసి నడుస్తా’ అని చెప్పారు. 2024 AUG 8న ఆమె రిటైర్మెంట్ ప్రకటించారు.

News December 12, 2025

పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమం

image

TG: పుట్టగొడుగుల పెంపకంతో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చు. అందుకే నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం.. పుట్టగొడుగుల పెంపకంపై తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, రెడ్‌హిల్స్, నాంపల్లిలో 13.12.2025న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు B.Manga HO 8977714411, Shujauddin 8688848714ను సంప్రదించగలరు.