News January 28, 2025
సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు: అంబటి ఎద్దేవా

AP: పథకాల అమలుపై సీఎం చంద్రబాబు చేసిన <<15282237>>కామెంట్లకు<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో కౌంటరిచ్చారు. ‘సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు. జగన్ మీద తోసేసి చంద్రబాబు, లోకేశ్ చేతులెత్తేశారు. హామీలు గాలికి వదిలేశారు. గోవిందా.. గోవిందా!!’ అని ఎద్దేవా చేశారు. అప్పుల పేరుతో CBN పథకాలు అమలు చేయడం లేదని అంబటి నిన్న విమర్శించిన విషయం తెలిసిందే.
Similar News
News February 11, 2025
నితీశ్ అలసిపోయారు.. మానసికంగా రిటైరైపోయారు: ప్రశాంత్ కిశోర్

బిహార్ CM నితీశ్ కుమార్‌పై జనసూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తాజాగా విమర్శలు గుప్పించారు. ‘ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్రం జరగనుంది. ఎన్డీయే గెలిచినా సరే నితీశ్ మాత్రం ఇక బిహార్ సీఎంగా కొనసాగరు. ఆయన పరిస్థితి బాలేదు. శారీరకంగా అలసి, మానసికంగా రిటైరైపోయారు. కనీసం తన మంత్రుల పేర్లు చెప్పే పరిస్థితిలో కూడా లేరు. బిహార్‌లో ఆయన ఇప్పుడు బీజేపీకి ఒక ముసుగు మాత్రమే’ అని పేర్కొన్నారు.
News February 11, 2025
బీచ్ ఫొటోలు ఎడిట్.. హీరోయిన్ ఆగ్రహం

ఒక నటిగా అందాన్ని ప్రదర్శించడంలో తాను జాగ్రత్తగా ఉంటానని మలయాళ నటి పార్వతీ R కృష్ణ చెప్పారు. అయితే ఇటీవల బీచ్ ఫొటో షూట్‌లో పాల్గొన్న దృశ్యాలను కొందరు యూట్యూబర్లు అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై ఇతరులు ఎందుకు స్పందించరో అర్థం కావట్లేదన్నారు. ఈమె ఏంజెల్స్, మాలిక్ తదితర చిత్రాల్లో నటించారు.
News February 11, 2025
‘మద్యం’పై మాట తప్పిన ప్రభుత్వాలు.. మీరేమంటారు?

తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపుపై మందుబాబులు ఫైరవుతున్నారు. APలో మద్యం ధరలు పెంచబోమని, తగ్గిస్తామని CM CBN, కూటమి నేతలు చెప్పి ఇప్పుడేమో బాటిల్‌పై రూ.10 పెంచారని మండిపడుతున్నారు. TGలో బీర్ల కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించబోమని, రేట్లు పెంచేది లేదని JANలో CM రేవంత్ ప్రకటించారు. నెల తిరక్కుండానే 15% పెంచి మాట తప్పారని దుయ్యబడుతున్నారు. ఈ అంశంపై మీ కామెంట్ ఏంటి?