News December 21, 2024
బీఆర్ఎస్ వాళ్లను ఉరి తీసినా తప్పులేదు: సీఎం రేవంత్
BRS సర్కారు 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి సర్కారుపై భారం మోపిందని CM రేవంత్ ఆరోపించారు. ‘వీళ్లను ఉరి తీసినా తప్పులేదు. అనేక బ్యాంకులు 2 నుంచి 4శాతానికి అప్పులిస్తుంటే వీళ్లు 11.5శాతానికి అప్పు తెచ్చారు. రూ.వేలాది కోట్లు వడ్డీలు కడుతున్నాం. ఇతర దేశాల్లో ఇంత ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేవారు. దుబాయ్‌లాంటి దేశాల్లో బజార్లో రాళ్లతో కొట్టి చంపి ఉండేవారు’ అని మండిపడ్డారు.
Similar News
News January 20, 2025
అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. 57 మంది అరెస్టు
కేరళలో అథ్లెట్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 57 మందిని అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మినహా అందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. ఐదు సార్లు యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు విచారణలో తేలింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్‌లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.
News January 20, 2025
భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్
భారత క్రికెటర్లు మ్యాచ్‌లకు హాజరయ్యే సమయంలో వ్యక్తిగత వాహనాలు ఏర్పాటు చేసుకోవద్దని ఆటగాళ్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. జట్టు సభ్యులంతా టీమ్ బస్సులోనే రావాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB)తో పాటు ఇతర రాష్ట్రాలకు తెలియజేసింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 కోల్‌కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను పాటిస్తామని CAB అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ తెలిపారు.
News January 20, 2025
నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.