News November 4, 2024
పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి
APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న dy.cm <<14527352>>పవన్ కళ్యాణ్<<>> వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కళ్యాణ్ భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు. పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తెలుసు. త్వరలో ఆయనతో మాట్లాడుతా’ అని BBCతో అన్నారు.
Similar News
News December 6, 2024
SHOCKING: నటి ప్రైవేట్ వీడియోలు లీక్
సౌత్ ఇండియా నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం కలకలం రేపింది. ఆమెకు సంబంధించిన వీడియోలను దుండగులు ఆన్‌లైన్‌లో పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో #pragyanagra హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందుకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. హరియాణాకు చెందిన ప్రగ్యా తమిళ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు.
News December 6, 2024
అల్లు అర్జున్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
‘పుష్ప 2’ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్, చిక్కడపల్లి పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు హైకోర్టు న్యాయవాది రామారావు తెలిపారు. ‘షోకు అల్లు అర్జున్ వస్తున్న విషయంపై సమాచారం లేదంటూ పోలీసులు తప్పించుకుంటున్నారు. ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణం. రేవతి కుటుంబానికి రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. నిందితులపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరాను’ అని రామారావు తెలిపారు.
News December 6, 2024
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి
TG: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల TGPSC ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశంను సర్కార్ నియమించిన విషయం తెలిసిందే.