News May 10, 2024
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్

AP: చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న బీజేపీతో ఎలా జత కట్టారని సీఎం జగన్ ప్రశ్నించారు. కడప సభలో మాట్లాడుతూ.. ‘ముస్లింలకు మత ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అవి కొనసాగి తీరాల్సిందే. ఇది మీ వైఎస్సార్ బిడ్డ మాట. NRC, CAA అంశాల్లోనూ మైనార్టీలకు అండగా ఉంటాం. 4 MLC, 7 MLA సీట్లు ఆ వర్గానికి ఇచ్చాం’ అని తెలిపారు.
Similar News
News February 19, 2025
‘ఆరెంజ్’ ఫ్లాప్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ రిప్లై!

రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాను అప్పట్లో ఫ్లాప్ చేయడంపై ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘అప్పుడు హిట్ చేసే వయసు మాకు రాలేదు. ఇంకో 50, 100 ఏళ్ల తర్వాత కూడా ఆరెంజ్ సినిమా క్లాసిక్’ అని రాసుకొచ్చాడు. దీనిపై డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ స్పందించారు. ‘చాలా థాంక్స్. సినీ పరిశ్రమ జీవితంలో అంతర్లీనం. కేవలం కొన్ని భావోద్వేగాలను చూపించాలనుకున్నా. కాబట్టి నాకు ఎటువంటి విచారం లేదు’ అని తెలిపారు.
News February 19, 2025
కుంభమేళాతో రూ.3లక్షల కోట్ల వ్యాపారం: CAIT

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాతో రూ.3లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ అంచనా వేశారు. దేశంలోనే ఇదో అతిపెద్ద ఎకనామిక్ ఈవెంట్ అన్నారు. దీంతో స్థానిక వ్యాపారాలు పుంజుకున్నాయన్నారు. డైరీస్, క్యాలెండర్లు, జూట్ బ్యాగులు, స్టేషనరీ, ఫుడ్, పానీయాలు, పూజా సామగ్రి, హోటల్, వస్త్ర, రవాణా, కళాకృతులకు డిమాండ్ పెరిగిందన్నారు. కాశీ, అయోధ్యకూ ఈ క్రేజ్ పాకిందని పేర్కొన్నారు.
News February 19, 2025
Stock Markets: బ్రాడర్ ఇండెక్సుల జోరు..

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 22,932 (-12), సెన్సెక్స్ 75,939 (-28) వద్ద ముగిశాయి. ఉదయం లాభాల్లో చలించిన సూచీలు క్రమంగా పతనమయ్యాయి. ఇంట్రాడే కనిష్ఠం నుంచి పుంజుకొని ఫ్లాటుగా క్లోజయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు ఎగిశాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు నష్టపోయాయి. BEL, హిందాల్కో, ఐచర్, యాక్సిస్ బ్యాంక్, LT టాప్ గెయినర్స్.